కలికిరి మండల కేంద్రంలోని బీడీ కాలనీకి చెందిన కాగితి నరేష్ (40) కలికిరి క్రాస్ రోడ్డు కలకడ రోడ్డులోని రామాలయం వద్ద బార్బర్ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు.ఇతను గురువారం మధ్యాహ్నం బహిర్భూమికి అని భార్యకు చెప్పి వెళ్ళాడు.ఎంతసేపటికి రాక పోవడంతో భార్య తన మరిదికి చెప్పి,చుట్టు పక్కల వెతకగా ఇంటికి దగ్గరలోని ఉమ్మనకుంట వద్దకి వెళ్ళగా చెప్పులు కుంట గట్టుపైన ఉండడాన్ని గమనించి చెరువులోనికి దిగి చూడగా నీళ్లలో మునిగి మృతి చెందాడు.మృతుడి భార్య ఇచ్చిన పిర్యాదు మేరకు ఏఎస్ఐ మాబూ సాబ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.