భారీ వర్షాలు, వరద సహాయం పైన సెక్రటేరియట్ నుండి సోమవారం సాయంత్రం 5-30 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఈ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి,సీతక్క,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జూపల్లి కృష్ణా రావు,వివేక్ వెంకటస్వామి,అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఉన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో పాటు అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లతతో పాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు.