ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశ వ్యాప్తంగా దళితుల ఐక్యతను దెబ్బతీయాలనే మోడీ–బీజేపీ కుట్ర జరుగుతోందని రాక్స్ అండ్ మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డా. ఆర్.ఎస్. రత్నాకర్ ఆరోపించారు.‘ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు ప్రధాన భాగస్వామి. 1975లో పంజాబ్‌లో కాంగ్రెస్ మొదట వర్గీకరణ బీజం వేయగా.. నేడు మోడీ దేశం మొత్తానికి విస్తరించారు. ఎస్సీ రిజర్వేషన్ల పేరుతో వందమందిలో నలుగురికే లాభం చేకూరుతుంది. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు, దేశ వ్యాప్తంగా 1108 కులాలకు సమానంగా లాభం పంచడం అసాధ్యం’ అని ఆయన వ్యాఖ్యానించారు.“ఇదే వర్గీకరణ అయితే..”రిజర్వేషన్లలో వర్గీకరణ చేస్తే.. దేశ సంపద, భూములు, మంత్రి పదవులు,