భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. బుధవారం ఆయన నారాయణఖేడ్ మండలంలోని మద్వార్, హనుమంతరావుపేట గ్రామాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులను పరిశీలించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లోని రహదారులను తాత్కాలికంగా మూసివేయాలని డీఎస్పీ వెంకట్ రెడ్డిని ఆదేశించారు. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఉంటే డయల్ 100కు కాల్ చేసి తెలియజేయాలని ప్రజలకు సూచించారు.