వినాయక చవితి సందర్భంగా రోడ్లకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని నరసరావుపేట వన్ టౌన్ సీఐ విజయ్ చరణ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన నరసరావుపేట పట్టణంలో గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ వేడుకల్లో మద్యం సేవించకూడదని రాజకీయ పార్టీల జెండాలు నిషేధమని తెలిపారు కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పూజకు ప్లాస్టిక్ పదార్థాలు వాడకూడదని సూచించారు. శాంతియుతంగా పండగ జరుపుకోవాలని ఆయన కోరారు.