బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం సంభవించిన ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోయినపల్లిలోని ఒక పెట్రోల్ బంకులో రెండు బైకులలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.