సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుండి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బ్యాగును మర్చిపోయిన ప్రయాణికురాలికి తిరిగి పోలీసులు అప్పగించారు. జహీరాబాద్ నుండి తోరమామిడి వెళ్లే బస్సులో ఆదివారం సాయంత్రం శోభ అని ప్రయాణికురాలు వెళ్తూ బస్సులో బ్యాగు మరిచి దిగిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా టికెట్ సహాయంతో ఆర్టీసీ సిబ్బందిని అప్రమత్తం చేసి బ్యాగును ఎస్ఐ నరేష్ ప్రయాణికురాలు శోభకు అందజేశారు. బ్యాగులో బంగారు ఆభరణాలు 50 వేల రూపాయల నగదు ఉన్నట్లు తెలిపారు. తక్షణమే స్పందించి ఉదారత చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ను అభినందించారు.