నిరుపేదల సొంతింటి కలలు సహకారం చేయడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా వర్షంలో సైతం జైనథ్ మండలంలోని పిప్పర్ వాడ గ్రామంలో మంత్రి పర్యటించారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఇందిరమ్మ ఇల్లును మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. లబ్దిదారులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు నూతన వస్త్రాలను సమర్పించారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని, అందుకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లతో ల