అమరావతిలోని మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజు, ప్రోత్సహించిన సాక్షి ఛానల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని అరకు నియోజకవర్గ టీడీపీ మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అరకు మండల టీడీపీ మహిళ అధ్యక్షులు బొరిబొరి లక్ష్మీ, ఉప సర్పంచ్ పాడి చందు నిర్మల తదితరులు ఆదివారం సాయంత్రం అరకు సీఐ హిమగిరికి పిర్యాదు చేశారు.