నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని వివిధ కాలనీలలో వీధి కుక్కలతో ప్రజలకు మరియు విద్యార్థులకు చాలా ఇబ్బంది ఉందని వాటి నుంచి రక్షణ కల్పించాలని, వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కార్యవర్గ సభ్యులు అబ్దుర్రహ్మాన్, అసెంబ్లీ అధ్యక్షులు ఖలీల్ కోరారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ బేబీ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ నాయకులు మాట్లాడుతూ పట్టణంలో కుక్కల బెడద రోజు.. రోజుకి పెరిగిపోతున్నదని, ప్రధానంగా కేజీ రోడ్డు, పగిడ్యాల రోడ్డు, సంగయ్యపేట, బైరెడ్డినగర్, ఎస్ఎస్ఆర్ నగర్, ట్యాంక్ ఏరియా, సుబ్బారావు పేట