అంత్యక్రియలకు హాజరైన హైకోర్టు న్యాయమూర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు నివాసంలో పని చేసే ఉదయ్ అనే యువకుడు మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం మామడ మండలం నల్దుర్తి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి, డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అంత్యక్రియలకు హాజరయ్యారు. పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భౌతికకాయాన్ని చూసిన శ్రీహరి రావు, న్యాయమూర్తి శ్రీదేవి కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రులు లేని ఉదయ్ గత కొన్నేళ్లుగా తమ ఇంట్లో పని చేస్తూ కుటుంబ సభ్యుడిగా ఉన్నాడని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడ