ఫ్లెక్స్ ముద్రించేటప్పుడు ఫ్లెక్స్ ప్రింటింగ్ యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొత్తపేట డీఎస్పీ సుంకర మురళి మోహన్ హెచ్చరించారు. రాజోలులో గురువారం ప్రింటింగ్ నిర్వాహకులతో జరిపిన సమావేశంలో మాట్లాడారు. ప్రింటింగ్ సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రింట్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రింట్ చేయమని ఎవరైనా వస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.