మైనర్ బాలిక కిడ్నాప్, హత్య కేసులో జిల్లా కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1,100/- జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 2024 జూలై 15 వ తేదీ జిల్లాలోని చేబ్రోలు మండలం, కొత్త రెడ్డిపాలెం గ్రామంలో (13) సంవత్సరాల మైనర్ విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటనలో నాగరాజు అనే వ్యక్తిని నిందితుడుగా గుర్తించి రిమాండ్ కు పంపించడం జరిగిందన్నారు. మైనర్ బాలిక తండ్రి దావీదు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.