ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముని చంద్ర తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 2.30 లకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ ఈ పొదుపు వారోత్సవాలలో వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ వినియోగంతో పాటు పొదుపు చేయడం కూడా విద్యుత్ వినియోగదారులు విద్యుత్ వినియోగంతో పాటు పొదుపు చేయడం కూడా అలవాటు చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.