రోడ్డు తెగిపోయి అవస్థలు పడుతున్న పర్వతాపూర్గ్రామస్తులు మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామస్థులు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా కోల్పోయారు. దాదాపు 200 మీటర్ల మేర రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామంలోని ప్రజలు అవసరాల నిమిత్తం బయటకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న తల్లి కూతురు అతికష్టం మీద శనివారం ఉదయం రాళ్ల మధ్య నడిచి బయటకు వచ్చారు. వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని మీడియా ద్వారా కోరుతున్నారు.