దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరుపులు, దుప్పట్లు పూర్తిగా పాడైపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ప్రతిరోజూ పదుల సంఖ్యలో వచ్చే రోగులకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో వారు ఇంటి దగ్గర నుంచి పరుపులు, దుప్పట్లు తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని రోగులు కోరుతున్నారు.