గాజువాక లంక గ్రౌండ్లో కొలువుతీరిన లక్ష చీరల సుందర వినాయకుని శ్రావణ చైతన్య కృష్ణ చిన్న స్వామి విచ్చేసి వినాయకుడికి ఆగమనం చేశారు. ఈ సందర్భంగా చిన్న స్వామి మాట్లాడుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన తగ్గిందని అందరూ వినాయక చవితి అంటే డీజే లు పెట్టుకొని డీజే లు పెట్టుకుని వెకిలి చేష్టలతో దైవాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని ఇది చాలా ప్రమాదకరమైన విషయమని ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతనకు లోబడి ఉండాలని అన్నారు. అప్పుడెప్పుడో చీరలు అంటే ద్రౌపతి వస్త్రాపహరణం గుర్తుకొచ్చేదని ఇప్పుడు చీరలు అంటే గాజువాక వినాయకుడు గుర్తుకు రావాలని ఆ విధంగా నిర్వాహకులు చర్యలు చేపట్టాలని తెలిపారు.