ప్రమాదవశాత్తు బైక్ నుంచి పడి గాయమై చికిత్స పొంది ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ ని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పరామర్శించారు. శనివారం ఎమ్మెల్యే సొసైటీలోని కిరణ్ కుమార్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు.