ఆముదాలవలస మండలం కొల్లివలస గ్రామంలో చర్చి వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రిస్టియన్ మత పెద్దల సమక్షంలో భక్తిశ్రద్ధలతో ప్రార్ధనలు నిర్వహించారు. ఆదర్శంగా నిలిచే పవిత్ర దినముగా నిర్వహించిన ప్రార్థనలో పలువురు క్రిస్టియన్ మతస్థులు పాల్గొన్నారు. సమస్త జీవరాశులకు పవిత్ర ఆత్మ ద్వారా ఇచ్చిన సందేశాన్ని సువార్త వ్యాఖ్యలను వివరించినట్లు రాడా విజయకుమార్ తెలిపారు.