ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ప్రజలను నీటి సమస్య పరిష్కరించేందుకు సోమవారం స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నాలుగు నూతన డీప్ బోర్ల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. పట్టణంలో మొత్తం 18 డీప్ బోర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తన శక్తికి మించి కృషి చేస్తారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక అధికారులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.