నరసన్నపేట మండలంలో మంగళవారం మధ్యాహ్నం వాతావరణ మార్పుల కారణంగా ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు పలు రహదారులు జలమయమయ్యా యి. నరసన్నపేట పట్టణంతో పాటు పలు పంచాయతీలోని గ్రామాలలో కూడా స్థానికులు ఇబ్బందులకు గురి అయ్యారు. భారీ వర్షంతో గ్రామాలలో రహదారులు సైతం వర్షపు నీటితో నిండిపోవడంతో అవస్థలు పడ్డారు. మండలంలోని తెలగవలస, సుందరాపురం తదితర గ్రామాలలో ఈ పరిస్థితి కనిపించింది.