వలకు చిక్కిన భారీ చేప కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని లోయర్ మానేరు జలాశయంలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ మత్స్య కారుడికి 25 కిలోల భారీ చేప వలకు చిక్కింది.తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్లో సంగంపల్లి గ్రామానికి చెందిన కూన సంపత్ సోమవారం సాయంత్రం మానేరు డ్యామ్లోకి చేపలు పట్టేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో అతడికి 25 కిలోల బొచ్చ చేప వలకు చిక్కింది. ఎన్నో సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నా ఇంత పెద్ద చేప వలకు చిక్కలేదని ఆనందం వ్యక్తం చేశాడు.