ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, వన మహోత్సవం, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన వెంట వెంటనే పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని వెంటనే పూర్తిచేయాలన్