రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో ఎరువుల వాడకానికి అలవాటు పడదాం అనే నినాదంతో ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద నుండి భారీ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ పోలీస్ మరియు ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలను నానో ఎరువులు వల్ల కలిగే లాభాలను తెలియచేసే ప్లక్కార్డులను చేతపుని ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం చర్చ్ సెంటర్ కూడలిలో మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ భూసార పరీక్షలను చేయించి వాటి ఆధారంగా పంటల ఎంపిక చేయాలని రైతులకు సూచించార