ఉపాధ్యాయుడిగా పనిచేసి రాష్ట్రపతి పదవిని అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ చూపిన బాటలో ఉపాధ్యాయులు నడవాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల కు అర్థమయ్యే రీతిలో బోధించాలని సూచించారు. ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు.