మచిలీపట్నం మండలం సీతారాంపురం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీ ద్వారా రైతులకు యూరియా పంపిణీని తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి, రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంగళవారం తెలిపారు. యూరియా బస్తాల కొరత సృష్టించినా లేదా ఎక్కువ ధరకు అమ్మినా సమీప వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు.