రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు వెల్లడించారు.బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నిరోధించడంలో పోలీసు,రవాణా,ఆర్ & బి వంటి శాఖలు కృషి చేయాలన్నారు. జాతీయ ఆరోగ్య అథారిటీ వద్ద నమోదైన ఆసుపత్రుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు జాతీయ ఆరోగ్య అథారిటీలో నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.