ఆదిలాబాద్ జిల్లాలో గంజాయిని కనుమరుగు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.గుడిహత్నూర్ మండలం తోషం శివారులో గంజాయి మొక్కలు పండిస్తున్న దేవరావుతోపాటు అతని కొడుకులు నగేష్, జగన్పై కేసు నమోదు చేశామన్నారు. బహిరంగ మార్కెట్లో పట్టుకున్న గంజాయి విలువ రూ.62.7 లక్షలు ఉంటుందన్నారు. గంజాయి పండించిన వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేస్తామన్నారు. గంజాయిపై సమాచారం అందించిన వారికి రివార్డ్ ఇస్తామన్నారు.