మంగపేట మండలంలోని గౌరారం వాగుకు వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో గురువారం సాయంత్రం పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. చేపల వేటకు వెళ్లడం, వాగులు దాటే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు.