దిలావర్పూర్ మండల కేంద్రంలో బుధవారం వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ గడ్డపై భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వీరవనితగా మారి చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్, రాజారెడ్డి, రమణ పోశెట్టి, రజక సంఘ నేతలు తదితరులు ఉన్నారు.