జాతీయ విపత్తుల ఫోర్స్ బృందాలు వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని శివరెడ్డిపేట చెరువులో ట్రయల్ రన్స్ చేశారు. శనివారం ఉదయం ప్రాజెక్టులో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు వారి సిబ్బందిచే ట్రయల్ రన్ చేస్తుండగా భారీగా చుట్టుముట్టు పక్కల ప్రజలు వచ్చి తిలకించారు. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు వచ్చి శిక్షణలో భాగంగా చెరువులో బోటింగ్ నిర్వహిస్తూ విన్యాసాలు చేశారు. జాతీయస్థాయిలో దేశంలో విపత్తులు వచ్చినప్పుడు ఈ బృందాలు సహాయక చర్యలు అందించేందుకు ఎంతగానో తోడ్పాటు నందిస్తాయని తెలిపారు.