తెలంగాణ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం స్థానిక బద్దంలా రెడ్డి భవన్ లో శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ ఏఐటియుసి పోరాటాల ఫలితంగా భవన నిర్మాణ కార్మికులసంక్షేమానికి గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం భవన నిర్మాణ పనులు చేస్తూ ప్రమాదంలో మరణించిన వారికి పది లక్షలు సహజ మరణం పొందిన వారికి 2 లక్షలు ఆర్థిక సహాయం అందించనున్నారని ఆయన పేర్కొన్నారు.