ఏసీ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు దగ్ధమైన ఘటన సోమవారం రాత్రి 9గంటలకు ఆసిఫాబాద్ పట్టణంలోని కంచుకోటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. కంచుకోట కాలానికి చెందిన తాటిపెల్లి సతీష్ ఇంట్లో సోమవారం రాత్రి విద్యుత్ ఓల్టేజ్ హెచ్చు తగ్గు కావడంతో ఏసీ వద్ద షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. ఆ తర్వాత ఇంట్లోని విద్యుత్ తీగలన్నీ కాలిపోయాయి ఇంట్లో ఉన్న వాళ్లు క్షేమంగా బయటపడ్డారు. ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకువచ్చింది.