జిల్లా కేంద్రానికి అక్రమంగా ఇసుకను తీసుకొని వెళుతున్న ఓటిపురును పోలీసులు పట్టుకున్న సంఘటన దేవరకద్ర మండల కేంద్రంలో శనివారం రాత్రి 10 గంటలకు చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండల పరిధిలోని గోరకొండ వాగులో టిప్పర్ ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని టిప్పర్ను స్వాధీనం చేసుకుని యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే అలాంటి వారిపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు.అనుమతులు లేనిదే ఎవరు కూడా ఇసుక రవాణా చేయరాదని తెలిపారు.