సకల విఘ్నాలు తొలగించే గణనాథుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిమజ్జన శోభయాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని నగరేశ్వర వాడ చౌరస్తాలో శనివారం నిర్మల్ నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వాగత వేదిక వద్ద పార్వతీతనయుడికి పూల వర్షంతో ఆహ్వానించారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు. ఇందులో ఉత్సవ సమితి అధ్యక్షులు మూర్తి ప్రభాకర్, పతికే రాజేందర్, ముప్పిడి రవి, పార్థసారథి, దొనగిరి మురళి, బీజేపీ, వీహెచ్పీ, బజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు.