ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వైసీపీ నాయకులు తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైంది. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు సబ్ కలెక్టర్ కార్యాలయమునకు భారీగా తరలివచ్చారు. దీంతో కార్యాలయంలోకి అనుమతించలేదు. వైసీపీ కార్యకర్తలకు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం నడుమ వైపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యేలు రాంబాబు నాగార్జున రెడ్డి సబ్ కలెక్టర్ ఎస్వి త్రివినాగ్ కు వినతి పత్రం అందజేశారు.