కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని యోగివేమన విశ్వవిద్యాలయానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలలో ఉత్తమ ర్యాంక్ వచ్చిందని శనివారం విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్లం శ్రీనివాస రావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఎన్.ఐ. ఆర్. ఎఫ్ ర్యాంకింగ్ లో విశ్వవిద్యాలయానికి 51 నుండి 100 లోపు ఉత్తమ ర్యాంకు లభించిందని తెలిపారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిశోధనలు, విద్యా బోధన, తదితర అంశాలను పరిగణించినట్లు ఆయన తెలిపారు.