తెలంగాణలో గత కొద్ది రోజులుగా లేడీ అఘోరీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం అందరి తెలిసిందే..ఆ అఘోరీ ఇప్పుడు రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో ప్రత్యక్షమైంది. శుక్రవారం రాత్రి దుబ్బగూడ గణపతి నిమజ్జనంలో అందరూ డాన్స్ చేస్తుంటే లేడీ అఘోరీ ప్రత్యక్షమై వారితో కలసి డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్ని రోజులు కనిపించని లేడీ అఘోరీ మళ్లీ ప్రత్యక్షమై గోలేటి కనిపించిందని స్థానికులు అంటున్నారు.