సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ వన మహోత్సవం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ పోలీసు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు మొక్కలను సంరక్షణ చేసేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు సిఐలు తదితరులు పాల్గొన్నారు.