గాజువాకలో నిర్మితమవుతున్న సుందర వస్త్ర గణపతిని సినిమా హీరో నారా రోహిత్ విచ్చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గణేష్ నిర్మిస్తున్న బొమ్మను గురించి పలు విషయాలు రోహిత్ కి చెప్పారు. లక్ష చీరలతో సుందర వస్త్ర గణపతి నిర్మిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా 70 వార్డ్ టిడిపి అధ్యక్షులు చట్టి గోపి మాట్లాడుతూ మా వార్డులో అంతర్జాతీయ స్థాయికి ఎదిగేటట్లు ఈ సుందర వస్త్ర గణపతి ని ప్రతిష్టించి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని ఎందుకు గణేష్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ బాధ్యత వహిస్తున్న పృద్వి తదితరులు పాల్గొన్నారు