వాహనదారులు రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు భద్రతను పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బోయలకుంట్ల క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. రికార్డులులేని వారికి, భద్రతా నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదని సూచించారు.