వినాయక చవితి సందర్భంగా వందే భారత్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు మహిళలు పాల్గొని స్త్రీ శక్తిని చాటి చెప్పారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వందే భారత్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని పలువురు మహిళలు పాల్గొని రక్తదానం చేయటం ఆనందించదగ్గ విషయమని తెలియజేశారు. భవిష్యత్తులో స్త్రీ శక్తిని తెలిపే తెలియజేసే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు