బాల్య వివాహాలు సమాజానికి పట్టిన రుగ్మత అని, వాటిని నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి, భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి Dr. B. లక్ష్మి నారాయణ అన్నారు. శనివారం మధ్యాహ్నం మూడున్నరకు గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో, స్వేఛ్ఛ మహిళా సంఘం సమన్వయంతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగపిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహం జరగాలని, బాల్య వివాహాల వల్ల చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని” తెలిపారు.