ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ఒక సామాన్య వ్యక్తి లా సైకిల్ పై తిరుగుతూ ప్రజల వద్ద సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే చిరు వ్యాపారులను కలిసి స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రోజువారీ కూలీలను పలకరిస్తూ వారిని జీవన విధానం అందుతున్న కూలి తదితర అంశాలపై చర్చించి వారికి సూచనలు సలహాలు ఇస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సామాన్య వ్యక్తి లా పట్టణంలో సబ్ కలెక్టర్ పర్యటించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.