శ్రీశైలం శిఖరం టోల్గేట్ వద్ద అటవీ శాఖ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్గీయులు దాడి చేసిన ఘటనను ఖండిస్తూ శనివారం డోన్ అటవీ శాఖ కార్యాలయంలో డిఆర్ఓ రవీంద్రనాయక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు