నిమజ్జనం రోజు మద్యం మత్తులో తమ గ్రామంలో న్యూసెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న 7గురు వ్యక్తులను బుధవారం సాయంత్రం బైండ్ ఓవర్ చేసినట్లు కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపారు. చెర్లబూత్కూర్ గ్రామానికి చెందిన అజయ్, తిరుపతి, స్వామి, సాయి కేశవ్, రాజేందర్, కుమార్, శ్రీనులు నిమజ్జనం రోజున అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వారిలో వారు గొడవ పడుతూ..ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా న్యూసెన్స్ చేస్తూ ఇబ్బంది కలిగించారు.వారిని మరల ఎలాంటి చట్ట వ్యతిరేక చర్య చేపట్టకుండా ముందస్తుగా రూరల్ తహసీల్దార్ ముందు హాజరు పరిచి అట్టి వారిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.