జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ వేశాలపల్లి గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని వెంబడించి విచక్షణారంగ కరచి గాయపరిచాయి. వేషాలపల్లి గ్రామానికి చెందిన కుడారి ఓదెలు, కన్నం సంతోష్ లతో పాటు మరో ఇద్దరిని కరిచి గాయపరిచాయి. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని రామ్ నగర్ కాలనీకి చెందిన వలీపాషా అనే వ్యక్తిపై కూడా వీధి కుక్కలు దాడి చేసి చేయిని కరిచాయి. దీంతో బాధితులకు చెవిపై ముక్కుపై చేతులపై కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 100 పడకల ఆసుపత్రికి తరలించారు.