మంజీరాలోకి 114 టిఎంసిల నీటి విడుదల ఈ యేడు మంజీరా నదిలోకి 114 టిఎంసిల నీటిని విడుదల చేశారు. మొదట 18 ఆగష్టు 2025న ప్రాజెక్ట్ గేట్లను తెరువగా 08 సెప్టెంబర్ 2025న గేట్లను మూసివేశారు. 19 రోజుల పాటు నాన్ స్టాఫ్ గా నీటి విడుదల కొనసాగింది.ఇప్పటి వరకు ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి మొత్తం 128.70 టిఎంసిల నీటి ఇన్ ఫ్లో రాగ 114.70 టిఎంసిల ఔట్ ఫ్లో మాంజీరలోకి వెళ్ళిందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.