రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలలో అనంతపురం నగరానికి చెందిన హీనా పైజా అనే చిన్నారి అత్యంత ప్రతిభను కనబరిచింది. ఏకంగా రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిన్నారి అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో రాణించడం పట్ల జిల్లా అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా నుంచి రాడించడం గర్వకారణం అని కొనియాడారు. చిన్నారిని తీర్చిదిద్దిన కోచ్ అంజిని ప్రత్యేకంగా అభినందించారు.