రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొని ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం మధ్యాహ్నం ములకలచెరువులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ములకలచెరువు మండలం పెద్దపాలెం రైల్వే గేట్ కు సమీపంలోని పాత రోడ్డులో రెండు టూ వీలర్లు ఎదురుదురుగా ఢీ కొన్నాయి. ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.